ENGLISH

పాపం.. హేమ‌ని బ‌లిప‌శువు చేస్తున్నారా?

24 June 2021-11:22 AM

`మా` ఎన్నిక‌లు ఈసారి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవిత‌.. వీళ్లంతా బ‌రిలో నిలిచారు. ఇప్పుడు వీళ్ల‌తో పాటు.. న‌టి హేమ కూడా దిగ‌బోతోంది. `నేను మా ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్నా` అంటూ హేమ ప్ర‌క‌టించింది. హేమా హేమీల మ‌ధ్య‌.. హేమ పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌క‌పోవొచ్చు. కాక‌పోతే.. హేమ నిల‌బ‌డ‌డం వెనుక సినిమా పెద్ద‌ల వ్యూహం ఉంద‌ని టాలీవుడ్ టాక్. హేమ కంటూ కొన్ని ఓట్లు ఉన్నాయి. అవి.. చీల్చ‌డానికే ఆమెను బ‌రిలోకి దింపార్ట‌.

 

`లేడీస్` ఓట్లు.. జీవిత‌కు ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. వాటిని చీల్చ‌డానికే హేమ‌ని పోటీ చేయ‌మ‌ని పెద్ద‌లు ఒత్తిడి తీసుకొచ్చార‌ని టాక్‌. ఈ ఎన్నిక‌ల‌లో హేమ పోటీ చేసినా.. గెలిచే అవ‌కాశాలు ఏమాత్రం లేవు. కేవ‌లం హేమ‌.. ఓట్ల చీలిక కోస‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. అలా.. ఓ వ‌ర్గానికి ప్ల‌స్, మ‌రో వ‌ర్గానికి మైన‌స్ అవ్వ‌డానికే హేమ‌ని పోటీలో నిల‌బెడుతున్నార‌ని టాక్‌. అంటే... కేవ‌లం ఓడిపోవ‌డానికే హేమ పోటీ చేస్తోంది. దాంతో కేవ‌లం హేమ‌ని బ‌లిప‌శువు చేయ‌డానికే రంగంలోకి దింపుతున్నార‌ని.. టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ALSO READ: శ్రుతి ఫైటింగులు మామూలుగా ఉండ‌వ‌ట‌!