ENGLISH

Saindhav: వెంకీ సినిమాలో మరో స్టార్ ?

20 February 2023-16:30 PM

వెంకటేష్‌ సైంధవ్ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. దీన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. . నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

 

ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, దీనికోసం మరో స్టార్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో ఆర్య ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఏప్రిల్‌ తొలి వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.