ENGLISH

బాహుబ‌లి షాక్ : ట్రైల‌ర్ ఒక‌టి కాదు... రెండు

11 March 2017-20:41 PM

ఈనెల 16న బాహుబ‌లి 2 ట్రైల‌ర్ విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ట్రైల‌ర్ విష‌యంలో రాజ‌మౌళి ఓ ట్విస్ట్ ఇచ్చారు. క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఒక‌టి కాదట‌.. రెండ‌ని తెలుస్తోంది. బాహుబ‌లి 2 కోసం రెండు  వెర్ష‌న్లు క‌ట్ చేశార‌ని, అందులో ఒక‌టి మాత్ర‌మే విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. బాహుబ‌లి 2 ప్ర‌మోష‌న్ విష‌యంలో రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్త‌లే తీసుకొన్నారు. బాహుబ‌లి 1 సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో బాహుబ‌లి 2 పై భారీ అంచ‌నాలు ఉంటాయ‌ని ఆయ‌న‌కు తెలుసు.  ఆ అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌కుండా... జాగ్ర‌త్త పడుతున్నారు. అందుకే.. ట్రైల‌ర్‌తో ఆ హైప్ మ‌రింత పెంచాల‌న్న ఉద్దేశంతో ప‌క‌డ్బందీగా ట్రైల‌ర్‌ని క‌ట్ చేశార‌ట‌. ఎందుకైనా మంచిద‌ని మ‌రో వెర్ష‌న్‌ని కూడా సిద్ధం చేశార‌ని. ఒక్కో వెర్ష‌న్ స‌రిగ్గా 140 సెకన్లు నిడివి ఉంటుంద‌ని.. అందులో ఏది వ‌ద‌లాలన్న విష‌యంలో రాజ‌మౌళి ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం.

ALSO READ: ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి భార్య వియోగం