ENGLISH

'బాహుబలి' టెన్షన్‌ పెంచేస్తోంది మరి!

15 March 2017-18:15 PM

'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందన్న వార్త బయటికి రాగానే జనాల్లో ఆశక్తి మొదలైంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అనే ఇంట్రెస్ట్‌ మరింత ఎక్కువయ్యింది జనంలో. అయితే ఈ లోగా సంచలనాత్మక ట్రైలర్‌ రేపే సినిమా ్‌ విడుదల కానుంది. సినిమాకే కాకుండా ఈ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం కూడా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సినిమా పబ్లిసిటీకి చేసినట్లే ట్రైలర్‌ రిలీజ్‌ పబ్లిసిటీ కూడా జరుగుతోంది. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. తెలిసిందే కదా ఈ సినిమా ట్రైలర్‌ని ఏదో యూ ట్యూబ్‌లోనో, లేక ఓ స్పెషల్‌ ఫంక్షన్‌లోనో విడుదల కావడం లేదు. ధియేటర్లో ఓ సినిమా మాదిరి విడుదలవుతోంది. ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు ఈ ట్రైలర్‌ని. ట్రైలర్‌కి సెన్సార్‌ కూడా అయిపోయింది. సెన్సార్‌ రిపోర్ట్‌ చాలా బాగుంది. ఇంతవరకూ సినిమా గురించే గొప్పగా మాట్లాడుకున్నాం. ఇకపై ట్రైలర్‌ కూడా గుర్తుండిపోయేలా రాజమౌళి ప్లానింగ్‌ అదరిపోయింది. ట్రైలర్‌ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్న తెలుగు సినిమా ఇదొక్కటేనేమో. మరి 'బాహుబలి' సినిమానా మజాకానా. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రమిది. రేపు ఉదయం ధియేటర్లో విడుదల కాగా, సాయంత్రం సోషల్‌ మీడియాలో విడుదల కానుంది. 

ALSO READ: తమ్ముడ్ని హీరోని చేస్తున్న హీరోయిన్‌