ENGLISH

Santosh Shoban: సంతోష్ శోభన్.. టైమ్ బ్యాడ్

23 February 2023-15:30 PM

హిట్లు ఫట్లు అనే సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నాడు సంతోష్‌శోభ‌న్. అతడి సినిమాలు క్రమం త‌ప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉన్నాయి. అయితే విజ‌యాలు మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్కడం లేదు. సంక్రాంతికి ‘క‌ళ్యాణం క‌మ‌నీయం’తో సంద‌డి చేశాడు. అంతకుముందు లైక్ షేర్.. తో వచ్చాడు. రెండూ ఫ్లాపులే. తాజాగా మరో మ‌రో చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ శివ‌రాత్రి సంద‌ర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

చిరంజీవి కుమార్తె సుష్మిత‌ నిర్మించిన చిత్రమిది. అయితే ఈ సినిమాపై కూడా మంచి టాక్ రాలేదు. చాలా వరకూ సినిమాకి రివ్యూలే దక్కలేదు. పాత కథ కథనాలని నమ్ముకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. చిరంజీవి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. రాలేదు దీంతో విడుదలకు ముందు కూడా సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది.