ENGLISH

బాల‌య్య త్రిపాత్రాభిన‌యం... టైటిల్ N..B..K

10 November 2021-15:34 PM

N..B..K అంటే నంద‌మూరి బాల‌కృష్ణ అని అంద‌రికీ తెలుసు. అదే.. ఇప్పుడు బాల‌య్య సినిమాకి టైటిల్ గా మారిపోతే...? అంత‌కంటే... ఆనందం ఏముంటుంది? ఇంత‌క‌న్నా కిక్ ఏం వ‌స్తుంది? అనిల్ రావిపూడి అదే చేయ‌బోతున్నార‌ని టాక్‌. వ‌రుస హిట్ల‌తో క్రేజీ ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 త‌ర‌వాత‌.. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అప్పుడు కుద‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో ఖాయం అయ్యింది.

 

త్వ‌ర‌లోనే.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఎఫ్ 3 అవ్వ‌గానే.. బాల‌య్య - రావిపూడి కాంబో ఉంటుంద‌ని టాక్‌. దీనికి N..B..K అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. N..B..K అంటే నంద‌మూరి బాల‌కృష్ణ కాదు. ఈ సినిమాలో బాల‌య్య త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడ‌ట‌. ఒక్కో మూడు పాత్ర‌ల్లోని తొలి అక్ష‌రాన్ని N..B..K గా సెట్ చేశాడ‌ట అనిల్ రావిపూడి. నిజానికి ఇది మంచి ఆలోచ‌నే. ఇంగ్లీష్ లెట‌ర్స్ తో వ‌స్తున్న సినిమాలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి. ఎఫ్ 2, కేజీఎఫ్ సినిమాలే అందుకు నిద‌ర్శ‌నం. ఆ జాబితాలో ఈ N..B..K కూడా చేరుతుందేమో చూడాలి.

ALSO READ: పూర్ణ‌తో ఎఫైర్‌.. ర‌విబాబు ఏమంటాడో?