ENGLISH

గ్యాంగ్ స్ట‌ర్‌గా బాల‌య్య‌

13 March 2017-12:23 PM

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమాకి క్లాప్ కొట్టారు. ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో బాల‌య్య గ్యాంగ్ స్టర్ గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇదో హాలీవుడ్ సినిమాకి కాపీ అని... హాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు సృష్టించిన ఓ సినిమాని తెలుగు నేటివిటీకి, బాల‌య్య శైలికి త‌గ్గ‌ట్టుగా పూరి మార్చుకొన్నాడ‌ని, అదే క‌థ‌తో ఇది వ‌ర‌కు తెలుగులో ఓ సినిమా వ‌చ్చి ఫ్లాప్ అయ్యింద‌ని తెలుస్తోంది. మ‌రి ఫ్లాప్ క‌థ‌తో.. పూరి మ‌రోసారి ప్ర‌యోగం ఎందుకు చేస్తున్నాడో మ‌రి!   హాలీవుడ్ కాపీ అనేది కేవ‌లం గాసిప్పేనా, ఇందులో విష‌యం ఉందా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ: మేడ‌మీద న‌రేష్‌... అమ్మ‌మ్మ ఇంట్లో నాగ‌శౌర్య‌