ENGLISH

55 కోట్లు ప‌లికిన బాల‌య్య సినిమా

10 February 2021-16:30 PM

ఎన్టీఆర్ బ‌యోపిక్కుల‌తో.. బాల‌కృష్ణ స్పీడుకు భారీ బ్రేక్ ప‌డింది. ఆ రెండు సినిమాలూ డిజాస్ట‌ర్లు గా మారిపోయాయి. `రూల‌ర్‌` కూడా.. ఫ‌ట్టుమంది. అంత‌కు ముందు వ‌చ్చిన `పైసా వ‌సూల్‌` కూడా అంతంత మాత్ర‌మే. మొత్తంగా... బాల‌య్య కెరీర్ డ‌ల్ గా ఉంది. `విన‌య విధేయ రామా` డిజాస్ట‌ర్ తో బోయ‌పాటి కూడా కామ్ అయిపోయాడు. ఇప్పుడు వీరిద్ద‌రి సినిమాకీ బిజినెస్ ఏముంటుంది? అనుకుంటే ఈ రేట్లు ట్రేడ్ వ‌ర్గాల్ని నివ్వెర‌పోయేలా చేస్తున్నాయి.

 

అవును.. బాల‌కృష్ణ - బోయాపాటి శ్రీ‌ను సినిమాకు సంబంధించిన ట్రేడ్ దాదాపుగా పూర్త‌యిపోయింది. ఏపీ, తెలంగాణ‌ల‌లో క‌లిపి థియేట‌రిక‌ల్ రైట్స్ 55 కోట్ల‌కు అమ్ముడైన‌ట్టు టాక్‌. ఏపీలో అయితే.. దాదాపు 35 కోట్లు ప‌లికింద‌ట‌. శాటిలైట్, ఓటీటీ, హిందీ డ‌బ్బింగ్‌.. ఇవ‌న్నీ క‌లుపుకుంటే మ‌రో 16 కోట్ల వ‌ర‌కూ రావొచ్చు. అంటే.. దాదాపు 70 కోట్ల‌న్న‌మాట‌. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా దాదాపుగా అంతే. బాల‌య్య సినిమాకి 70 కోట్ల బ‌డ్జెట్టా? అంటూ ఆశ్చ‌ర్య‌పోయిన‌వాళ్లు.. ఇప్పుడు ఈ రాబ‌డి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కాంబినేష‌న్ అట్టాందిది మ‌రి.

ALSO READ: చ‌ర‌ణ్ చుట్టూ... ద‌ర్శ‌కుల ప్ర‌ద‌క్షిణ‌లు