ENGLISH

కొత్త ట్రెండ్ సృష్టించిన బాల‌య్య‌

01 February 2021-09:30 AM

నంద‌మూరి అభిమానుల‌కు గుడ్ న్యూస్ అందింది. బాల‌కృష్ణ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ అయిపోయారు. రిలీజ్ డేట్ ఓకే. కానీ... ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీలేదు. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌కుండా... రిలీజ్ డేట్ చెప్పేశారేంటో? బ‌హుశా.. ఇదో కొత్త ట్రెండ్ అనుకోవాలి.

 

ఈ సినిమా కోసం `మోనార్క్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది. దాదాపు అదే ఖాయం అనుకుంటున్నారంతా. ఆ టైటిలే అయితే... ఈపాటికే టైటిల్ చెప్పేసేవారు. కానీ.. టైటిల్ విష‌యంలో బోయపాటి.. పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈమ‌ధ్య‌... బోయాపాటి కాస్త పొయెటిక్ టైటిల్ ల‌పై దృష్టి పెట్టాడు. విన‌య విధేయ రామా, జ‌య జాన‌కీ నాయ‌క‌.. ఇలా అన్న‌మాట‌. ఈసారీ అదే ఫాలో అవుతాడా? లేదంటే సింహా, లెజెండ్ లా... షార్ప్ గా ఉండే టైటిల్ తో వ‌స్తాడా? అనేది ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోనే బోయ‌పాటి టైటిల్ నీ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ALSO READ: వెంకీకి చిరు సెగ