ENGLISH

పూరిపై బాల‌య్య గుస్సా..??

09 March 2017-12:38 PM

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమా ఈరోజే ప‌ట్టాలెక్కింది. వచ్చే నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పూరి బాల‌య్య‌కు అద్భుత‌మైన క‌థ చెప్పాడ‌ని, అందుకే ఫామ్ లో లేక‌పోయినా, పూరికి బాలయ్య అవ‌కాశం ఇచ్చాడ‌ని చెప్పుకొంటున్నారు. అయితే.. ఓ విష‌యంలో మాత్రం పూరిపై బాల‌య్య కోపంగానే ఉన్నాడ‌ట‌. కొత్త న‌టీన‌టుల కోసం పూరి కాస్టింగ్ కాల్ ప్ర‌క‌టించ‌డం, బాల‌య్య స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్ల‌నీ కొత్త‌వాళ్ల‌నే తీసుకోవాల‌ని నిర్ణ‌యించ‌డం బాల‌య్య‌కు ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది.  ఓ స్టార్ హీరో సినిమాకి కాస్టింగ్ కాల్ ఇవ్వ‌డం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి.  పూరి కాస్టింగ్ కాల్ ఇవ్వ‌డం  ఈ సినిమా క్రేజ్‌ని దెబ్బ‌తీసింద‌ని బాల‌య్య సన్నిహితులు భావిస్తున్నార్ట‌. ఆ విష‌యం బాల‌య్య‌కూ తెలిసింద‌ని, అందుకే పూరిపై ఫైర్ అయ్యాడ‌ని స‌మాచారం. మ‌రి కాస్టింగ్ కాల్ ఆపేస్తారా, కొత్త వాళ్ల స్థానంలో సీరియ‌ర్ హీరోయిన్ల‌ని తీసుకొంటారా?  లేదంటే ఎలాగూ ప్ర‌క‌టించారు కాబ‌ట్టి, కొత్త‌వాళ్లతో స‌రిపెట్టుకొంటారా అనేది తేలాల్సివుంది.