ENGLISH

బాల‌య్య నిజంగా సాయం చేశాడా?

19 October 2020-13:46 PM

ఇటీవ‌ల వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ అంతా అత‌లాకుత‌లం అయిపోయింది. నాలాలు పొంగి ప్ర‌వ‌హించాయి. రోడ్లు జ‌ల‌పాతాల్ని త‌ల‌పించాయి. ప్ర‌జ‌లంలా బిక్కుబిక్కుమంటూ గ‌డిపారు. అపార‌మైన ఆస్థి న‌ష్టం జ‌రిగింది. ఇప్పుడు వారిని చేయూత‌నిచ్చే అభ‌య‌హ‌స్తాలు కావాలి. ఇలాంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ ముందుకొచ్చారని, వ‌రద బాధితుల‌కు 50 ల‌క్ష‌ల స‌హాయం అందించార‌ని, అలానే బ‌స‌వ‌తారకం ఆసుప‌త్రి నుంచి రోజుకి 1000 ఆహార పొట్లాల‌ని స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. దాంతో బాల‌య్య ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. త‌మ హీరో దాన క‌ర్ణుడ‌ని, మిగిలిన‌వాళ్లు ఆయ‌న్ని చూసి నేర్చుకోవాల‌ని కామెంట్లు పెట్టారు.

 

అయితే బాల‌య్య అలాంటి స‌హాయం ఏమీ చేయ‌లేద‌ట‌. అదంతా కావాల‌ని ప్రచారం చేస్తున్న రూమ‌రే అని తేలిపోయింది. దాంతో... ఈ విష‌యాన్ని వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్ ఖంగు తిన్నారు. ఇలాంటి సంక్షోభాలు సంభ‌వించిన‌ప్పుడు హీరోలు ముందుకొచ్చి స‌హాయం చేయ‌డం మూమూలే. బాల‌య్య కూడా ఇలానే చాలాసార్లు స‌హాయం అందించాడు. ఈ వార్త నిజం చేసే కెపాసిటీ, మ‌న‌సు బాల‌య్య‌కు ఉంది. త్వ‌ర‌లోనే బాల‌య్య నుంచి స‌హాయం అందుతుందేమో చూడాలి.

ALSO READ: రౌడీ‌తో బోయ‌పాటి?