ENGLISH

బాల‌కృష్ణ‌తో న‌టించే ఆ హీరో ఎవ‌రు?

19 November 2021-11:00 AM

టాలీవుడ్ లో గ‌త కొన్ని రోజులుగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తార‌న్న‌దే ఇప్పుడు ఆ వార్త‌లోని హాట్ టాపిక్‌. బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. కొర‌టాల శివ క‌థ చెబుతానంటే `నో` అనే హీరోఎవ‌రూ ఉండ‌రు. కాబ‌ట్టి... బాల‌య్య - కొర‌టాల శివ కాంబో షాకింగ్ ఏమీకాదు. కాక‌పోతే.. ఇది సోలో హీరోసినిమాకాద‌ని, మ‌ల్టీస్టారర్ సినిమా అని మ‌రో వార్త జోడిస్తున్నారు.

 

బాల‌కృష్ణ‌తో మ‌ల్టీస్టార‌ర్ అంటే, ఆరేంజ్ మామూలుగా ఉండ‌దు. దాంతో ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మ‌ల్టీస్టార‌ర్ అంటే.. చిన్నా, చిత‌కా హీరోని తీసుకొచ్చేసే రోజులు కావు ఇది. బాల‌య్య ఇమేజ్ కి స‌రిప‌డా హీరోఉండాలి. కొర‌టాల శివ మైండ్ లోనూ అదే ఉంది. టాప్ 3 హీరోల్లో ఒక‌రితో బాల‌య్య‌ని క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌న్న‌ది త‌న ఆలోచ‌న‌.

 

కొర‌టాల మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి ప‌నిచేశాడు. వీళ్ల‌లో ఒక‌రితో ఈ మ‌ల్టీస్టార‌ర్ రూపొందించే ఛాన్స్ ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీళ్ల‌లో ఎవ‌రైనా... ఈ మ‌ల్టీస్టార‌ర్ అదిరిపోవ‌డం ఖాయం.

ALSO READ: వంద థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షో.. ఎక్క‌డంటే..?