ENGLISH

పైసా వసూల్ కి ఫ్యాన్స్ షోలు లేవట?!

31 August 2017-18:58 PM

బాలయ్య బాబు పైసా వసూల్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన బెనిఫిట్ షోల విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వారికొక చేదు వార్త తెలిసింది.

అదేంటంటే- ఈ మధ్యకాలంలో బెనిఫిట్ షోలకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్న సంగతి విదితమే. ఈ తరుణంలో పైసా వసూల్ చిత్రానికి కూడా అనుమతి నిరాకరించడంతో అభిమానులకి నిరాశ తప్పటంలేదు.

దీనితో రేపు ఉదయం నుండే షోలు ఉంటాయి, ప్రత్యేకమైన షోలు ఏమి ఉండవు అని స్పష్టమైపోయింది. పైసా వసూల్ టాక్ తెలియాలంటే రేపు ఉదయం 11 వరకు ఆగాల్సిందే.
 

 

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?