ENGLISH

ఆహా నుంచి ఆరు కోట్లు

17 October 2021-11:49 AM

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఆహా కోసం. ఆహాలో ప్ర‌సారం కాబోయే `అన్ స్టాప‌బుల్‌` అనే టాక్ షోకి బాల‌య్యే హోస్ట్‌. ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ ప్ర‌ముఖుల్ని ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ కార్య‌క్ర‌మం మొద‌లు కాబోతోంది. ఇప్ప‌టికే ఓ చిన్న‌పాటి ప్రోమోని సైతం విడుద‌ల చేశారు.

 

ఈ షో కోసం బాల‌య్య ఎంత పారితోషికం తీసుకోబోతున్నారు? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక్కో సినిమాకీ బాల‌య్య 8 నుంచి 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ పారితోషికం తీసుకుంటున్నారు. ఓటీటీలో ఓ టాక్ షో చేయ‌డం బాల‌య్య‌కు ఇదే తొలిసారి. బాల‌య్య షో అనేస‌రికి క‌చ్చితంగా సినీ ప్రేమికుల దృష్టి ప‌డుతుంది. ఆహా ఓటీటీలోనే ఇది హైలెట్ అయ్యే అవ‌కాశం ఉంది. అందుకే ఆహా కూడా బాల‌య్య కోరినంత పారితోషికం ఇవ్వ‌డానికి రెడీ అయ్యింది. ఒక్కో ఎపిసోడ్ కీ దాదాపు 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం ఇస్తున్నార్ట‌. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రాబోతోంది. అంటే... ఆహా నుంచి బాల‌య్య‌కు ఏకంగా ఆరు కోట్లు రాబోతున్నాయ‌న్న‌మాట‌. 12 ఎపిసోడ్ల‌నీ కేవ‌లం 12రోజుల్లో పూర్తి చేస్తారు. ఓరంక‌గా సినిమాల కంటే ఇదే బాగా గిట్టుబాటు అవుతున్న‌ట్టు లెక్క‌.

ALSO READ: రామ్ చరణ్ 2022 డైరీ ఫుల్!