ENGLISH

ఎనిమిదిమంది హీరోయిన్లా బంగార్రాజు..?

10 January 2022-10:43 AM

నాగార్జున అంటే రొమాంటిక్ కింగ్. త‌న సినిమాల్లో రొమాన్స్‌కి చోటు ఉండాల్సిందే. ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్ల‌తో నాగార్జున ఆడి పాడుతుంటే మ‌జాగా ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయిన లో హీరోయిన్ల హంగామా ఎక్కువే. దానికి ప్రీక్వెల్ గా వ‌స్తున్న బంగార్రాజుల‌నూ.. హీరోయిన్ల గుంపే క‌నిపించ‌బోతోంది. ఇందులో ఏకంగా 8మంది హీరోయిన్లు క‌నిపిస్తార్ట‌.

 

కృతి శెట్టి ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ కి జోడీగా ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌బోతోంది. ఓ పాట‌లో.. జాతిర‌త్నాలు ఫేమ్ ఫైరా అద్భుల్లా ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. వీళ్ల‌తో పాటుగా మీనాక్షి దీక్షిత్‌, ద‌ర్శ‌న బానిక్‌. ద‌క్ష‌, సిమ్ర‌త్ కౌర్ లు కూడా చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అంటే ఇందులో ఎనిమిది మంది క‌థానాయిక‌లు మెర‌వ‌బోతున్నార‌న్న‌మాట‌. అయితే.. వీళ్ల‌లో చాలామంది అతిథి పాత్ర‌ల్లోనే క‌నిపిస్తారు. ర‌మ్య‌కృష్ణ‌, కృతి మాత్ర‌మే.. పూర్తి స్థాయి క‌థానాయిక‌లు అనుకోవాలి. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈనెల 14న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక్రాంతి బ‌రిలో ఉన్న అతి పెద్ద సినిమా ఇదే కావ‌డంతో.. అంద‌రి చూపూ ఈ సినిమాపై ప‌డింది.

ALSO READ: బంగారం లాంటి బిజినెస్‌.. నాగ్ కెరీర్‌లో ఇదే రికార్డ్‌