బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈలోగా మూడో సినిమా కూడా మొదలైపోయింది. గణేష్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. తేజ శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి, సీత చిత్రాలకు తేజ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు రాకేష్.
తేజ నిర్మాణంలో ఓ ఇండిపెండెంట్ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి `నాంది` సతీష్ వర్మ నిర్మాత. ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించడం విశేషం. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదో న్యూ ఏజ్ థ్రిల్లర్. యాక్షన్, థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథానాయిక, ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి.
ALSO READ: అన్నీ ఓకే చిరు... కానీ మెహర్ రమేష్ అంటేనే..!