ENGLISH

సాయి స్క్వేర్ కాంబో.. ఉత్తిదేనా..??

22 August 2020-11:00 AM

సాయిధ‌ర‌మ్ తేజ్‌.. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌... వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. అనిల్ రావిపూడి క‌థ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది క్రేజీ కాంబో. యంగ్ మ‌ల్టీస్టార‌ర్‌. త‌ప్ప‌కుండా సినిమాకి కొబ్బ‌రికాయ కొట్ట‌క ముందే.. అంచ‌నాలు ఆకాశానికి అంటుతాయి. కాక‌పోతే... ఈ ప్ర‌పోజ‌ల్ అన్న‌ది కేవ‌లం రూమ‌రే అని తెలుస్తోంది.

 

ఇప్పటి వ‌ర‌కూ.. ఇలాంటి కాంబో గురించి ప్ర‌స్తావ‌న త‌మ ద‌గ్గ‌ర‌కు రాలేదని సాయిధ‌ర‌మ్ తేజ్ సన్నిహితులు చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ వ్య‌క్తిగ‌త పీ.ఆర్ కూడా ఇదే మాట అంటోంది. అనిల్ రావిపూడి క‌థ‌తో, న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తుండ‌డం నిజ‌మే. అందులో ఇద్ద‌రు హీరోలుంటారు. కానీ.. ఆ హీరోలు మాత్రం వీళ్లు కాదు. పైగా ఈ ప్రాజెక్టు ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే వుంది. అన్నీ సెట్ట‌య్యాకే... హీరోల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ALSO READ: చిరంజీవ.. చిరంజీవ‌... సుఖీభ‌వ‌.. సుఖీభ‌వ‌