ENGLISH

మోహన్‌బాబు బుతూలు తిట్టారు: కన్నీరు పెట్టుకున్న బెనర్జీ

12 October 2021-19:02 PM

సీనియర్ నటుడు బెనర్జీ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.మా ఎన్నికలలో మోహన్ బాబు తనని అమ్మబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని, నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా తనకు సంతోషంగా లేదని, మూడు రోజులు పాటు నరకం అనుభవించానని, ఇప్పుడు రాజీనామా చేయడం మనసుకు తేలిగ్గా వుందని కన్నీరు పెట్టుకున్నారు బెనర్జీ.

 

'' ఎన్నిల రోజు మోహన్‌బాబుగారు తనీశ్‌ను తిడుతున్నారని, విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అనడంతో మోహన్‌బాబుగారు కొట్టడానికి వచ్చేశారని, విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారని, అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారని, ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా'' అని కన్నీటి పర్యంతమయ్యారు బెనర్జీ. సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల్లో జరిగిన అన్యాయాలు, విష్ణు ప్యానల్ ప్రవర్తించిన తీరు ని మీడియా ముందు వుంచారు.

ALSO READ: బిగ్ ట్విస్ట్ : ప్రకాష్ రాజ్ ఫ్యానల్ మొత్తం రాజీనామా