ENGLISH

బిగ్‌ బెట్టింగ్‌: బిగ్‌బాస్‌ విన్నర్‌ 'ఎ'వరు.!

14 December 2020-15:30 PM

'బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తెలుగు' విన్నర్‌ 'ఎ'వరవుతారు.? బరిలో మొత్తం ఐదుగురు మిగిలారు గ్రాండ్‌ ఫినాలే కోసం. అబిజీత్‌, అఖిల్‌, అరియానా, అలేఖ్య హారిక, సోహెల్‌ ఆ ఐదుగురు. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇందులో 'ఎ' లెటర్‌తో మొదలయ్యే కంటెస్టెంట్స్‌ నలుగురున్నారు. మొదటి నుంచీ 'ఎ' లెటర్‌ చుట్టూనే బిగ్‌బాస్‌ గేమ్‌ నడుస్తూ వచ్చింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 'ఎ' ప్రస్తావన బిగ్‌బాస్‌ షోలో వినిపిస్తూనే వుంది.

 

ఇప్పుడు బెట్టింగులు కూడా ఆ 'ఎ' చుట్టూనే జరుగుతున్నాయి. అబిజీత్‌ వర్సెస్‌ అఖిల్‌.. ఈ బెట్టింగులు విపరీతంగా జరుగుతున్నాయట. అదే సమయంలో అరియానా చుట్టూ కూడా బెట్టింగ్స్‌ బాగానే నడుస్తున్నాయనేది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్‌ విషయంలో కూడా బెట్టింగ్స్‌ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయన్నది మరో వాదన. కాగా, టాప్‌ 5లో వున్న ఐదుగురిలో ముగ్గురికి 'సీక్రెట్‌ రూమ్‌'తో సంబంధం వుంది.

 

సీక్రెట్‌ రూమ్‌ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్‌, అరియానా.. నాటకీయ పరిణామాల మధ్య కొన్నాళ్ళ క్రితం సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్ళిన అఖిల్‌.. ఇప్పుడు టాప్‌ 5లోకి వచ్చారు. ఇదిలా వుంటే, అఖిల్‌ని ఈ సీజన్‌ విన్నర్‌గా మార్చాలని ఇప్పటికే బిగ్‌బాస్‌ టీమ్‌ సిద్ధమైపోయిందన్న ప్రచారమూ జరుగుతోంది. కానీ, ఓటింగ్‌ పరంగా చూసుకుంటే, అబిజీత్‌కి దరిదాపుల్లో ప్రస్తుతానికి ఎవరూ లేరన్నది ఇంకో వాదన. ఏమో, ఏది నిజమోగానీ.. టైటిల్‌ విన్నర్‌గా 'ఎ' లెటర్‌ మాత్రమే నిలిచే అవకాశం వుందన్నది మెజార్టీ బిగ్‌బాస్‌ వీక్షకుల అభిప్రాయం.

ALSO READ: సూర్య ప‌క్క‌న కృతి?