ENGLISH

Bhanu Priya: భానుప్రియ ఇలా అయిపోయిందేంటి?

06 February 2023-14:49 PM

అల‌నాటి అందాల తార భానుప్రియ‌. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌... ఇలా అగ్ర హీరోలంద‌రితోనూ న‌టించింది. డాన్స్‌లో.. భాను ప్రియ పెట్టింది పేరు. శాస్త్రీయ నృత్యంలో ఆమెకు తిరుగులేదు. భానుప్రియ న‌టించిన సితార‌, స్వ‌ర్ణ‌క‌మ‌లం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు అమ్మ‌, పిన్ని, అత్త పాత్ర‌ల‌కు షిష్ట్ అయ్యారామె. అయితే కొంత‌కాలంగా భానుప్రియ వెండి తెర‌పై క‌నిపించ‌డం లేదు. ఆమెకు అవ‌కాశాలు రావ‌డం లేదా? లేదంటే... ఆమెనే సినిమాల్ని వ‌దులుకొందా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. దీనిపై.. భానుప్రియ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

 

ఇటీవ‌ల భానుప్రియ‌కు జ్ఞాప‌క‌శ‌క్తి బాగా త‌గ్గిపోతోంద‌ట‌. సెట్లో ద‌ర్శ‌కుడు ఇచ్చిన డైలాగులు మ‌ర్చిపోతోంద‌ట‌. అలా... సెట్లో డైలాగులు చెప్ప‌లేక‌, షూటింగ్ వ‌దిలేసి, ఇంటికొచ్చేశాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు భానుప్రియ‌. త‌న‌కు నాట్యం అంటే చాలా ఇష్ట‌మ‌ని, దానికి సంబంధించిన ముద్ర‌లు కూడా గుర్తుకు రావ‌డం లేద‌ని, అందుకే సినిమాల వైపు దృష్టిసారించ‌లేక‌పోయాయ‌ని చెప్పుకొచ్చారు. ఈమ‌ధ్యే భానుప్రియ భ‌ర్త మ‌ర‌ణించారు. అప్ప‌టినుంచీ ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌య్యింద‌ట‌. భానుప్రియ‌ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. మాన‌సిక ఒత్తిడి వ‌ల్లో, మ‌రి దేనివ‌ల్లో... భానుప్రియ చాలా పాడైపోయారు. ఆమెను చూసి.. భానుప్రియేంటి? ఇలా అయిపోయింది? అంటూ ఒక‌ప్ప‌టి ఆమె అభిమానులు బెంగ పెట్టుకొంటున్నారు.