ENGLISH

పెళ్ళయ్యాకా సినిమాల్లో నటిస్తా: భావన

13 March 2017-17:55 PM

లైంగిక వేధింపులతో భావన సినిమా కెరీర్‌కి ముగింపు పడ్డట్లేనని కొందరు దుర్మార్గులు భావించారు. అందుకే ఆమెను లైంగికంగా వేధించినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా, తనను వేధించినవారి బండారం బయటపెట్టింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో మహిళలు అంత తెగవ చూపించరు. అదే అక్రమార్కులకి ధైర్యం. కానీ భావన ఈ విషయంలో చూపించిన తెగువతో సినీ పరిశ్రమ అంతా ఆమెకు అండగా నిలిచింది. మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఆమె తెగువను కీర్తించింది. ఇంకో వైపున భావన, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడబోతోంది. ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయ్యింది. పెళ్ళయిన తర్వాత సినిమాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు 'నటన నాకు ఇష్టం. నన్ను పెళ్ళాడబోయే నా స్నేహితుడు నవీన్‌కి కూడా నేను సినిమాల్లో కొనసాగడం ఇష్టమే. కాబట్టి సినిమాల్ని మానేయాల్సిన అవసరం నాకు లేదు' అని సమాధానమిచ్చింది భావన. ఆ ఘటన గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని భావన, నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడాల్సిందేనని మాత్రం చెబుతోంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచినవారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది భావన. సినీ పరిశ్రమ నుంచి ఇంత మద్దతు వస్తుందని భావన ఊహించలేదట. 

ALSO READ: రోబో 2.0 శాటిలైట్ రేటు వింటే ఆశ్చర్యపోవాల్సిందే!