ENGLISH

బిగ్‌బాస్‌ అంత పెద్ద తప్పు చేసేశాడట.!

12 December 2020-17:16 PM

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌కి సంబంధించి కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ వ్యవహారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, మొదటి ఎవిక్షన్‌ నుంచి ఇప్పటివరకు.. బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్‌లో ఏ ఒక్కరిదీ న్యాయబద్ధంగా 'ఎలిమినేషన్‌' జరగలేదనే అభిప్రాయం బిగ్‌బాస్‌ వీక్షకుల్లో బలంగా వుంది. అలాగని, వెళ్ళినోళ్ళంతా గొప్ప ఎంటర్‌టైనర్స్‌ అని కాదు.. హౌస్‌లో వున్నోళ్ళు, వెళ్ళిపోయినోళ్ళకంటే గొప్పోళ్ళు కాదన్నది బిగ్‌బాస్‌ వీక్షకుల అభిప్రాయం. ప్రస్తుతం హౌస్‌లో వున్నవాళ్ళందరితో పోల్చితే మెహబూబ్‌ సూపర్‌ పవర్‌.

 

అవినాష్‌ సంగతి సరే సరి. గ్లామర్‌ పరంగా చూసుకుంటే దివి ఈజ్‌ ది బెస్ట్‌. లాస్య కూడా అంత తొందరగా హౌస్‌ నుంచి బయటకు వెళ్ళాల్సిన కంటెస్టెంట్‌ కాదు. దేవి నాగవల్లి విషయంలోనూ అన్యాయం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే, ఈ వారం బిగ్‌బాస్‌ చాలా పేలవంగా సాగింది. సోహెల్‌ - అరియానా మధ్య గొడవ తప్ప, ఈ వారం చెప్పుకోదగ్గ ఎపిసోడ్‌ ఒక్కటీ లేదన్నది బిగ్‌బాస్‌ వీక్షకుల వాదన. అదే గనుక, అవినాష్‌ హౌస్‌లో వుంటే, కావాల్సినంత స్టఫ్‌ దొరికేదనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

 

అసలు అవినాష్‌ని ఎందుకు పంపించేశారు.? మోనాల్‌ని హౌస్‌లో ఎందుకు వుంచారో కూడా అర్థం కావడంలేదు బిగ్‌బాస్‌ వీక్షకులకి. ఎవర్నో కాపాడే క్రమంలో ఇంకెవర్నో బలిచేస్తూ వస్తున్నారంటూ మొదటి నుంచీ బిగ్‌బాస్‌ మీద ఒకే కంప్లయింట్‌ కొనసాగుతూ వుండడం గమనార్హం. షో ముగుస్తున్న సమయంలో బిగ్‌బాస్‌ చాలా పెద్ద తప్పు చేసేశాడనీ, అదే అవినాష్‌ని బయటకు పంపేయడమనేది మెజార్టీ బిగ్‌బాస్‌ వీక్షకుల అభిప్రాయం.

ALSO READ: బాలీవుడ్ న‌టి అనుమానాస్ప‌ద మృతి