ENGLISH

Bigg Boss 6: బిగ్ బాస్ 6.... ఈసారి ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

21 June 2022-17:02 PM

తెలుగులో అతి పెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకొంది బిగ్ బాస్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ 5 సీజ‌న్లు ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచాయి. బుల్లి తెర‌లో కూడా బిగ్ బాస్ షో.. పెద్ద హిట్ట‌య్యింది. ఇప్పుడు 6వ సీజ‌న్‌కి రంగం సిద్ధ‌మైంది. ఈ సీజ‌న్‌కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హరించ‌బోతున్నారు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో ఈ కొత్త సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బిగ్ బాస్ విన్న‌ర్ కి రూ,50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ అందిస్తూ వ‌స్తున్నారు. 6 వ సీజ‌న్ లో మాత్రం ప్రైజ్ మ‌నీ పెర‌గ‌బోతోంద‌ని టాక్. ఈ సీజ‌న్‌లో గెలిచిన వారికి రూ.75 ల‌క్ష‌లు ఇవ్వ‌బోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. సెల‌బ్రెటీల‌ను ఆక‌ర్షించ‌డానికే ఈసారి ఇంత ప్రైజ్ మ‌నీ పెట్టార‌ని తెలుస్తోంది.

 

ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటార‌న్న విష‌యంలో లీకులు వ‌స్తున్నాయి. హైప‌ర్ ఆది, యాంక‌ర్ వ‌ర్షిణి, ధ‌న్షు, చిత్ర‌రాయ్ త‌దిత‌రుల పేర్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. మాజీ హీరోయిన్లు, పేరున్న యాంక‌ర్లు, సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న‌వాళ్ల లిస్టు ఇప్ప‌టికే.... బిగ్ బాస్ నిర్వాహ‌కుల చేతికి చేరిపోయింది. ఇప్పుడు వాళ్ల‌తో బిగ్ బాస్ టీమ్ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఈసారి సామాన్యుల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వాల‌ని, వాళ్ల‌ని ప్రోత్స‌హించాల‌ని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. మ‌రి ఆ అదృష్టం ఈసారి ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

ALSO READ: స‌మంత స్ట్రాంగ్‌గానే ఇచ్చింది