ENGLISH

బిగ్‌బాస్‌ ‘ఎమోషనల్‌’ కట్టుకథలు!

06 November 2020-14:00 PM

బిగ్‌బాస్‌ ఏదో ఎమోషన్‌ స్టోరీ చెప్పమంటాడు.. ప్రేక్షక్షకుల్ని ఏడిపించేలా కంటెస్టెంట్స్‌ ఏదో ఒక స్టోరీ చెబుతుంటారు. ఇదిప్పుడు కొత్తగా చూస్తున్నదేమీ కాదు.. గత మూడు సీజన్లలోనూ ఇదే చూశాం.. ఇప్పుడూ ఇదే చూస్తున్నాం. సో, కంటెస్టెంట్స్‌ ముందుగానే ప్రిపేర్‌ అయిపోయి.. ఓ కథ రాసేసుకుని, దాన్ని హౌస్‌లో వినిపించేస్తుంటారన్నమాట. టీవీ సీరియళ్ళు కాస్త నయం కదా ఈ విషయంలో.? అంటూ నిన్నటి ‘ఎమోషనల్‌ స్టోరీ’ ఎపిసోడ్‌ తర్వాత బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ చాలామంది సెటైర్లు వేస్తున్నారు. తారలకు సంబంధించిన ఎమోషనల్‌ స్టోరీస్‌తో వారి అభిమానులు బాగా కనెక్ట్‌ అవుతారన్న కాన్సెప్ట్‌తోనే ఈ తరహా స్టోరీల ఎపిసోడ్‌కి ప్లాన్‌ చేస్తుంటారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు అదీ అసలు కథ. లాస్య తదితరులు చెప్పిన ఎమోషనల్‌ స్టోరీస్‌ చాలా తక్కువమందికి పాజిటివ్‌గా రీచ్‌ అవుతున్నాయి. గత సీజన్లలోనూ ఈ తరహా డ్రమెటిక్‌ సెన్స్‌ ఎక్కువగానే కనిపించినా, ఇప్పుడు అది టన్నులకొద్దీ కనిపిస్తోంది. అదే అసలు సమస్య. ఈ స్టోరీస్‌, కంటెస్టెంట్స్‌ పట్ల నెగెటివిటీని పెంచుతున్నాయి తప్ప, వారికి ఏమాత్రం పాజిటివిటీని పెంచలేకపోతున్నాయన్నది బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ అభిప్రాయం. రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్‌పై ఇంట్రెస్ట్‌ తగ్గిపోతోంది బుల్లితెర వీక్షకుల్లో. దానికి ఈ తరహా డ్రమెటిక్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ALSO READ: బొద్దుగుమ్మ ‘మేఘా’ల్లో తేలిపోతోందే.!