ENGLISH

బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ అరెస్ట్

22 February 2024-11:04 AM

బిగ్‌బాస్‌ ఫేం, యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్,  సూర్య వెబ్ సిరిస్‌తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. ఫేమస్ యూట్యబర్ గా పలువురి మన్ననలు అందుకున్నాడు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఐదో సీజన్ లోకి అడుగుపెట్టాడు. తన ఆటతీరుతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మనసులు గెల్చుకుని రన్నరప్ గా నిలిచాడు.  తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ తరచూ  వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యాడు.  మద్యం సేవించి వాహనం నడిపాడని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.  మళ్లీ ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడడం అందరినీ షాక్ కు గురి చేసింది.
  

ఓ అమ్మాయి  షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ పై కంప్లైన్ట్ ఇవ్వగా అతన్ని అరెస్ట్ చేయటానికి తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు,  అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తాగుతూ  కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఏపీకి చెందిన ఓ అమ్మాయితో పదేళ్లుగా ప్రేమాయణం నడిపి, మూడేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నాడు. కానీ తరువాత ఆమెను వదిలించుకుని, 20 రోజుల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు, తానూ మోస పొయానని గ్రహించి  పోలీసులను ఆశ్రయించింది.


తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ కంప్లైన్ట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా, షణ్ముఖ్‌ ఒక్కడే గంజాయి సేవిస్తూ కనిపించాడు. దాంతో పోలీసుల ప్లాట్ ని సోదా చేయగా గంజాయి దొరికింది. గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్‌ పోలీసులతో పాటు వెళ్లిన అమ్మాయితో దురుసుగా ప్రవర్తించినట్లు  కూడా తెలుస్తోంది.