ENGLISH

Bigg Boss season 6: బిగ్ బాస్ 6... ఎవ‌రెవ‌రు వ‌చ్చారో తెలుసా?

05 September 2022-11:18 AM

బుల్లి తెర‌పై బ్ర‌హ్మాండ‌మైన వినోదం పంచుతున్న రియాలిటీ షో బిగ్ బాస్‌... మ‌రోసారి అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. కొత్త సీజ‌న్ బిగ్ బాస్ -6 ఆదివారం సాయింత్రం లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ కొత్త సీజ‌న్ లో సెల‌బ్రెటీలు ఎవ‌రెవ‌రు పాల్గొంటారు? అనేదారిపై చాలా కాలంగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు వాటికి పుల్ స్టాప్ పెడుతూ... అస‌లైన సెల‌బ్రెటీలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టేశారు.

 

కీర్తి భ‌ట్‌, సుదీప, చ‌లాకీ చంటీ, బాలాదిత్య‌, శ్రీ‌హాన్‌, నేహా చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, అర్జున్ క‌ల్యాణ్‌, గీతూ రాయ‌ల్‌, అభియ‌న శ్రీ‌, రోహిత్, మ‌లీనా. షాని స‌ల్మాన్‌, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి ప్ర‌తీసారీ ఎవ‌రినో ఒక‌రిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొంటారు. ఈసారి.. చ‌లాకీ చంటీ అడుగుపెట్టాడు. టీవీ 9 నుంచి ఓ యాంక‌ర్ ని తీసుకోవ‌డం అల‌వాటు. ఈసారి.. ఆ స్థానం ఆర్జే సూర్య‌కి ద‌క్కింది. ఒక‌ప్ప‌టి ఐటెమ్ గాళ్ అభిన‌య శ్రీ‌, బుల్లి తెర స్టార్ బాలాదీత్య ఈసారి సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ కానున్నారు.

ALSO READ: Manchu Manoj: రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిన మంచు హీరో