ENGLISH

అబిజీత్‌ పంచన అఖిల్‌ చేరింది అందుకేనా?

10 November 2020-15:20 PM

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌కి సంబంధించినంతవరకు ప్రతి వారం హయ్యస్ట్‌ ఓట్లు సాధిస్తున్న కంటెస్టెంట్‌ అబిజీత్‌ మాత్రమే. అతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్ళలేకపోతున్నారు. ఈ విషయం ఎలా తెలిసిందోగానీ, అఖిల్‌ సార్థక్‌ అప్రమత్తమయ్యాడు.. అబిజీత్‌తో వైరాన్ని పక్కన పెట్టి, అబిజీత్‌కి స్నేహితుడిగా మారిపోయాడు. అయితే, ఈ వారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్స్‌ ప్రక్రియలో అబిజీత్‌ని నామినేట్‌ చేయడానికి పాయింట్‌ దొరక్కపోయినా, ఓ పనికిమాలిన పాయింట్‌ పట్టుకుని నామినేట్‌ చేసేశాడు.. అదీ నవ్వుతూనే.

 

అయితే, ఇలాంటి విషయాల్లో షార్ప్‌గా వుండే అబిజీత్‌, అఖిల్‌ని నిలదీశాడు. దాంతో అఖిల్‌ సమాధానం చెప్పలేక కిందా మీదా పడ్డాడు. ఈ ఎపిసోడ్‌లో అఖిల్‌ అతి తెలివి బ్యాక్‌ఫైర్‌ అయితే, అబిజీత్‌ స్మార్ట్‌నెస్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. బిగ్‌హౌస్‌కి సంబంధించి ఇతరుల మీద అస్సలు ఆధారపడని కంటెస్టెంట్‌ ఎవరన్నా వుంటే అది అబిజీత్‌ మాత్రమే. ఫిజికల్‌ టాస్క్‌ల విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు.. డాన్సులు చేయడంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

 

కానీ, ఆయా విషయాల్లో స్ట్రెయిట్‌గా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అదే అతనికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. అబిజీత్‌ అభిమానుల్లో కాస్తో కూస్తో గత కొద్ది రోజులుగా సాఫ్ట్‌ ఇమేజ్‌ పొందిన అఖిల్‌, ఇప్పుడు మళ్ళీ అబిజీత్‌ అభిమానుల నుంచి ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నాడు. మోనాల్‌తో కష్టమని తెలిసి ఆమెను వదిలించుకుని, అబిజీత్‌ పంచన చేరి.. అబిజీత్‌తోనూ తేడా కొట్టేశాక అఖిల్‌, నెక్స్‌ట్‌ ప్లాన్‌ ఎలా వుంటుందో.

ALSO READ: బుట్టబొమ్మ కవరింగ్‌.. కుదిరిందా? లేదా?