ENGLISH

బిగ్‌ షాక్‌: దివి వికెట్‌ ఔట్‌ అవుతుందా.?

22 October 2020-17:28 PM

బిగ్‌బాస్‌లో చిత్ర విచిత్రమైన ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఓట్ల పరంగా కాకుండా, బిగ్‌బాస్‌ నిర్వాహకుల ఆలోచనలకు అనుగుణంగా ఎలిమినేషన్స్‌ జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్‌ అయినవారిలో ‘దివి’ మెడ మీద కత్తి వున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి దివికి మంచి ఫాలోయింగే వుంది బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో. హౌస్‌లోనూ ఆమె పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. కాస్తో కూస్తో నెగెటివిటీ వున్నా.. ఇతర కంటెస్టెంట్లతో పోల్చితే ఆమె చాలా బెటర్‌. టాస్క్‌లలోనూ బాగానే టాలెంట్‌ చూపిస్తోంది.

 

గ్లామరస్‌ అండ్‌ స్టన్నింగ్‌ బ్యూటీగా కూడా ఆమెకు గుర్తింపు వుంది. అయినాగానీ, ఎవర్నో సేవ్‌ చేయడానికి దివిని బలిపశువుని చేయబోతున్నారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మోనాల్‌ గజ్జర్‌, అవినాష్‌, అరియానా, అబిజీత్‌, నోయెల్‌ సీన్‌ తదితరులు ఈ సారి ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ అయ్యారు దివితోపాటు. ఓట్ల పరంగా చూస్తే మోనాల్‌ చాలా వీక్‌గా వుంది. అరియానా, నోయెల్‌ కూడా డేంజర్‌ జోన్‌లోనే వున్నారు. దివి సేఫ్‌గానే వున్నప్పటికీ ఆమెపైనే వేటు పడబోతోందన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఈ తరహా లీకులు ముందే ఇచ్చి, అసలు ఎలిమినేషన్‌ ఇంకోలా ప్లాన్‌ చేయడం ఈ మధ్య ట్రెండింగ్‌గా మారింది. సో, ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడే చెప్పలేం. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ కోసం అరియానా, అవినాష్‌ పోటీ పడుతున్నారు. అవినాష్‌ కెప్టెన్‌ అయ్యాడంటూ లీకులు అందుతున్నాయ్‌.

ALSO READ: వెంకీ రెడీ అయ్యాడు.. 'నార‌ప్ప' స్టార్ట్ అయ్యేది అప్పుడే!