ENGLISH

బిగ్‌బాస్‌ ఫినాలె: విన్నర్‌.. రన్నరప్‌.. లిస్ట్‌ ఇదేనా.?

19 December 2020-13:30 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తెలుగు ముగింపుకి వచ్చేసింది. రేపే గ్రాండ్‌ ఫినాలె. ఎవరు విజేత అవుతారు.? అన్నదానిపై ఇప్పటికే దాదాపు ఓ స్పష్టత వచ్చేసింది. అబిజీత్‌నే ట్రోఫీ వరించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, దాదాపు అన్ని అనధికారిక పోల్స్‌లోనూ 50 శాతం పైగా ఓట్లు సాధించేశాడు అబిజీత్‌. కానీ, బిగ్‌బాస్‌ అధికారిక ఓటింగ్‌ వివరాలు ఎలా వున్నాయో ప్రస్తుతానికైతే సస్పెన్సే.

 

ఇదిలా వుంటే, విన్నర్‌ మాత్రమే కాదు, రన్నరప్‌ సహా మొత్తం లైనప్‌ ఇదేనంటూ ఓ లీక్‌ బయటకు వచ్చింది. ఆ లీక్‌ ప్రకారం చూస్తే అబిజీత్‌ టాప్‌ ప్లేజ్‌లో వున్నాడు. రన్నరప్‌గా సోహెల్‌ వుండబోతున్నాడట. మూడో ప్లేస్‌ అరియానాకి దక్కనుందనీ, నాలుగో ప్లేస్‌కే అఖిల్‌ పరిమితమవనున్నాడనీ, చివరి ప్లేస్‌తో హారిక సరిపెట్టుకుంటుందనీ అంటున్నారు.

 

అయితే, ఇదంతా ట్రాష్‌ అంటూ ఆయా కంటెస్టెంట్ల అభిమానులు దీర్ఘాలు తీస్తున్నారు. ఫిమేల్‌ కంటెస్టెంటే విన్నర్‌.. అన్న కోణంలో అరియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోహెల్‌, అఖిల్‌ కూడా నెంబర్‌ వన్‌ ప్లేస్‌ కోసం పోటీ పడుతున్నారు. దాదాపుగా ఏ పోలింగ్‌లోనూ హారిక విజేతగా కన్పించకపోవడం గమనార్హం. ఎటూ రేపు ఫినాలె సందర్భంగా ఈ సస్పెన్స్‌కి తెరపడిపోతుంది గనుక.. ఈలోగా అభిమానుల మధ్య గొడవలు అనవసరం. పైగా, ఇది జస్ట్‌ రియాల్టీ షో. మొదటి సీజన్‌కి గొడవలేం లేవుగానీ, రెండో సీజన్‌.. మూడో సీజన్‌కి వచ్చేసరికి అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేసి నానా లొల్లీ చేశాయి. అదిప్పుడు ఇంకాస్త ముదిరింది.

ALSO READ: క్రిష్‌కి కంగ‌నా చేసిన అన్యాయం ఇదీ...!