ENGLISH

బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... ఈసారి ఇద్ద‌రు హోస్ట్‌లు

06 July 2021-16:31 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన షో... బిగ్ బాస్‌. తెలుగులోనూ క్లిక్ అయ్యింది. ఎన్టీఆర్‌, నాని, నాగార్జున లాంటి స్టార్ సెలబ్రెటీలు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో.. ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ 5కి సంబంధించిన క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఈసారి కూడా నాగార్జున‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. అయితే.. బిగ్ బాస్ టీమ్ కొత్త ట్విస్టు ఇవ్వ‌బోతోంది. ఈసారి నాగార్జున‌తో పాటు .. మ‌రో హోస్ట్ కూడా రానున్నాడ‌ట‌. ఆ అవ‌కాశం అలీకి దక్కింద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

 

సాధార‌ణంగా హోస్ట్ ఎవ‌రైనా స‌రే.. వీకెండ్ కే వ‌చ్చి, హ‌డావుడి చేస్తాడు. శ‌ని, ఆదివారాల‌లో ఒక‌రోజు.. స‌రికొత్త గెస్ట్ ని తీసుకురావ‌డం కూడా ఆన‌వాయితీ. ఆ గెస్టుల‌తో పాటుగా.. అలీ కూడా వేదిక‌పై ఉంటాడ‌ని తెలుస్తోంది. ప్రేక్ష‌కుల‌లో స‌రికొత్త జోష్ పెంచ‌డానికి అలీ... ఎంట్రీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి అలీతో సంప్ర‌దింపులు మొద‌లెట్టారు. `అలీతో స‌ర‌దాగా` లాంటి కార్య‌క్ర‌మాల‌తో అలీ కూడా.. బుల్లి తెర ప్రేక్ష‌కుల అభిమానుల్ని గెలుచుకున్న‌వాడే. కాబ‌ట్టి.. ఈ షోలో పాల్గొన‌డానికి అలీకి పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండ‌క‌పోవొచ్చు.

ALSO READ: 'సలార్' కోసం మ‌రో బాలీవుడ్ భామ‌