ENGLISH

బిగ్‌బాస్‌ కొత్త సందడి మళ్లీ మొదలైంది.

28 January 2021-09:30 AM

ఎన్ని రియాల్టీ షోస్‌ ఉన్నా, వాటన్నింట్లోనూ బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజే వేరు. బిగ్‌బాస్‌ మొదలవుతుందంటే చాలు, ఆడియన్స్‌లో కొత్త ఆశక్తి. గతేడాది బిగ్‌బాస్‌ కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైంది. కానీ, కరోనా టైమ్‌లో వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నే పంచగలిగింది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ని ముస్తాబు చేస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఈ సారి కాస్త త్వరగానే షోని ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ దిశగా ఆల్రెడీ సెలబ్రిటీల ఎంపిక జరుగుతోందనీ సమాచారం.

 

ఇదిలా ఉంటే, ఈ సారి పెద్దగా పేరున్న సెలబ్రిటీలు పార్టిసిపేట్‌ చేయడానికి ఆసక్తి చూపడం లేదన్న రూమర్‌ ఉంది. గతంలోనూ ఈ రూమర్‌ కొనసాగింది. కానీ, బిగ్‌ హౌస్‌కి సంబంధించి, అంతకు ముందు వరకూ ఉన్న క్రేజ్‌తో సంబంధం లేదు. వన్స్‌ హౌస్‌లో ఎంటర్‌ అయితే చాలు.. ఆటోమెటిగ్గా బిగ్‌ సెలబ్రిటీస్‌ అయిపోతారు. ఆ రేంజ్‌లో ఈ షోని ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. అయితే, కాస్త ఎక్కువ ఖర్చు పెట్టినా సరే, ఈ సారి పెద్ద సెలబ్రిటీస్‌నే తీసుకు రావాలనుకుంటున్నారట బిగ్‌బాస్‌ టీమ్‌.

 

ఏది ఏమైతేనేం, బిగ్‌బాస్‌ మళ్లీ స్టార్ట్‌ అవుతుందంటే, ఆ కిక్కే వేరప్పా. ఇదిలా ఉంటే, గత సీజన్‌ బిగ్‌బాస్‌కి వచ్చిన క్రేజ్‌తో కొందరు కంటెస్టెంట్లు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సీజన్‌ కంటెస్టెంట్లు ఎవరెవరు, ఎలాంటి క్రేజ్‌ దక్కించుకుంటారో చూడాలంటే కాస్త వెయిట్‌ చేయాల్సిందే.

ALSO READ: చిరు పొలిటిక‌ల్ రీ ఎంట్రీ..?