ENGLISH

నాన్‌స్టాప్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌ బిందు మాధవి

21 May 2022-23:33 PM

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. బిగ్ బాస్ ఐదో సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న అఖిల్ సార్థక్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా చివ‌రకు బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. దీంతో బిగ్ బాస్ తెలుగు వెర్షన్‌లో ఓ మ‌హిళ విన్నర్‌గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. టైటిల్ రేసులోకి వ‌చ్చిన అఖిల్ సార్ధ‌క్ కంటే...బిందు మాధ‌వికి ఓ అంశం బాగా క‌లిసి వచ్చింద‌ని చెప్పాలి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఆమె ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

 

ఈ క్రమంలో అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచే మ‌ద్దతు రాగా... బిందు మాధ‌వికి మాత్రం తెలుగుతో పాటు త‌మిళం నుంచి కూడా భారీ ఎత్తున మ‌ద్దతు ల‌భించింది. బిందు మాధవి గెలుపుకు ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఏదేమైనా షో మొదటి నుండి దూకుడుగా ఆడిన బిందు మాధవి అందరి అభిమానం అందుకొని షో విజేతగా నిలివడం అభినందనీయం.

ALSO READ: నో డౌట్‌... ఇది బ‌న్నీ క‌థే!