ENGLISH

బాలీవుడ్ న‌టి అనుమానాస్ప‌ద మృతి

12 December 2020-12:01 PM

చిత్ర‌సీమ‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి ‌ అర్య బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమె వ‌య‌సు 33 ఏళ్లు. విద్యాబాల‌న్‌ ‘ డర్టీ పిక్చిర్’‌లో ఓ కీల‌క పాత్ర పోషించారు బెన‌ర్జీ మ‌రి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. బెన‌ర్జీ మోడ‌లింగ్ లోనూ రాణించారు.

 

శుక్ర‌వారం కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె మృత్యువాత ప‌డ్డారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు.

ALSO READ: సోహెల్‌, అరియానా.. బిగ్‌బాస్‌కి 'ఊపు' తెచ్చారోచ్‌.!