ఈమధ్య దాసరి వారసుల పేర్లు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తొలుత దాసరి కొడుకులిద్దరి మధ్యా ఆస్తి తగాదాలొచ్చాయి. సినీ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరించాలని చూసినా కుదర్లేదు. దాంతో ఇద్దరూ కేసుల వరకూ వెళ్లారు. ఆ వ్యవహారం సద్దుమణిగింది. మొన్నటికి మొన్న దాసరి చెల్లించాల్సిన పాత బాకీల విషయంలో సోమేశ్వర్ అనే ఫైనాన్షియర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు నర్సింహులు అనే వ్యక్తి దాసరి అరుణ్ కుమార్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
దాసరి ఇంట్లో నరసింహులు చాలా కాలంగా పని చేస్తున్నాడు. ఈ నిమిత్తం.. నరసింహులకు కొంత మొత్తం రావాల్సివుంది. చాకా కాలంగా ఈ మొత్తాన్ని ఇవ్వడం లేదు. ఈ విషయమై దాసరి ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఇటీవల రెండు రోజుల క్రితం తనని ఇంటికి పిలిచి, కులం పేరుతో అవమానించాడని నరసింహుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ALSO READ: 'కనబడుటలేదు' మూవీ రివ్యూ & రేటింగ్!