ENGLISH

గ్లామర్‌కి అస్సలు సిగ్గుపడనంటోన్న ముద్దుగుమ్మ

21 July 2018-12:50 PM

'ఇద్దరమ్మాయిలు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కేథరీన్‌. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా చిత్రాల్లోనే నటించింది కానీ, వాటిలో ఎక్కువ సెకండ్‌ హీరోయిన్‌ క్యారెక్టర్సే కావడం గమనించదగ్గ విషయం. సెకండ్‌ హీరోయిన్‌ అయినా కానీ, అమ్మడు పోషించిన పాత్రలన్నీ రిజిస్టర్డ్‌ పాత్రలే. 

క్యారెక్టర్‌లో బలం ఉంటే, నెంబరింగ్‌ అస్సలు పట్టించుకోనంటోంది కేథరీన్‌. అలాగే ఓ పక్క హీరోయిన్‌గా నటిస్తూనే, మరో పక్క హాట్‌ హాట్‌గా ఐటెం సాంగ్స్‌తోనూ అలరిస్తూంటుంది. అలా అని ఏది పడితే అది ఒప్పేసుకోదండీ. సెలెక్టివ్‌గానే చేస్తుంది. కేథరీన్‌కి డాన్సంటే ప్రాణం. చిన్నతనం నుండీ డాన్సులో శిక్షణ పొందిందట. అందుకే ఐటెం సాంగ్స్‌లో అందాలారబోతకే ప్రాధాన్యత అని కాకుండా, ఆకట్టుకునే స్టెప్పులతోనూ ఇరగదీసేస్తుంది. 

ప్రస్తుతం తెలుగులో కన్నా, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తమిళంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎక్కువగా దక్కుతాయి. అందుకే ప్రస్తుతం కోలీవుడ్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టిందట. అంతేకాదు, తమిళం కూడా నేర్చుకుంటోందట. అయితే తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టు చర్చల దశలో ఉందట. త్వరలోనే ఆ వివరాలు చెబుతానంటోంది. మరో హింట్‌ కూడా ఇచ్చింది. 

ఇంతవరకూ హాట్‌ అండ్‌ గ్లామరస్‌ రోల్స్‌లోనే ఎక్కువగా చూసిన కేథరీన్‌ని, ఈ సినిమాలో ఓ స్టన్నింగ్‌ రోల్‌లో చూస్తారట.
 

ALSO READ: మెగాఛాన్స్‌ వదిలేసుకున్న అల్లు వారబ్బాయ్‌.!