ENGLISH

ఆ నటుడి మరణంపై సీబీఐ విచారణ

12 April 2017-16:19 PM

కళాభవన్‌ మణి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. వెండితెరపై సరికొత్త విలనిజం పండించాడీ విలక్షణ నటుడు. వివిధ జంతువుల్ని అనుకరించడం కళాభవన్‌ మణి ప్రత్యేకత. అదే అతన్ని వెండితెరపై మిగతా నటులకు భిన్నంగా మార్చింది. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన 'జెమిని' సినిమాలో విలన్‌గా నటించాడు కళాభవన్‌ మణి. అయితే అనూహ్యంగా 2016 మార్చిలో ఈ విలక్షణ నటుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నపాటి అనారోగ్యం ఆయనకు ఉన్నప్పటికీ కూడా, ప్రాణాలు కోల్పోయేంతటి తీవ్రమైనది కాదది. ఆయన్ని ఎవరో చంపేశారనే అనుమానాలు రావడంతో, కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ఇప్పటికే కొనసాగుతోంది. హైకోర్టు లేటెస్ట్‌గా సీబీఐ విచారణకు ఆదేశించడంతో దక్షిణాదిలో కళాభవన్‌ మణి గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఈయన తెలుగులో నటించిన మరో చిత్రం 'అర్జున్‌'. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేశాడు. నటుడిగా రంగస్థలం నుంచి ప్రస్థానం ప్రారంభించి, వరుస అవకాశాలతో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న కళాభవన్‌ మణి మృతికి సంబంధించి వినవస్తున్న ఆరోపణలు, అనుమానాలపై సిబిఐ విచారణలో ఏం తేలుతుందో చూడాలిక. 

 

ALSO READ: లారెన్స్‌లా ఆ ధైర్యమెవరికి ఉంటుంది?