ENGLISH

చావు క‌బురు చ‌ల్ల‌గా.. న‌ష్టాలేమో భారీగా

28 March 2021-14:31 PM

ఈమ‌ధ్య భారీ క్రేజ్ తో, పాజిటీవ్ బ‌జ్ తో విడుదలైన సినిమా ఏదైనా ఉందంటే.. అది `చావు క‌బురు చ‌ల్ల‌గా`నే. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌డం, జీఏ 2 లాంటి సంస్థ నుంచి ఈ సినిమా రావ‌డంతో ఫోక‌స్ బాగా ప‌డింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ తొలి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఏ ద‌శ‌లోనూ ఈ సినిమా తేరుకోలేదు. ఈ సినిమాకి దాదాపుగా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తీరా చూస్తే.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర 3 కోట్లే తెచ్చుకుంది. అంటే... దాదాపుగా 11 కోట్ల న‌ష్టం అన్న‌మాట‌. ఓటీటీ రూపంలో మంచి డ‌బ్బులు వ‌స్తాయ‌నుకుంటే.. `ఆహా`కి ఈసినిమా ప‌రిమిత‌మైపోయింది. గీతా ఆర్ట్స్ దే ఆహా కావ‌డంతో... ఆహా నుంచి.. డ‌బ్బులు వ‌చ్చిన రాన‌ట్టే. మొత్తానికి బ‌య్య‌ర్ల‌కు ఈ సినిమా భారీ న‌ష్టాల్ని మిగిల్చింది.

 

చావు క‌బురుచ‌ల్ల‌గా.. క్లోజింగ్ క‌ల‌క్ష‌న్లు

 

నైజాం 1.19 cr

సీడెడ్ 0.55 cr

ఉత్తరాంధ్ర 0.36 cr

ఈస్ట్ 0.23 cr

వెస్ట్ 0.14 cr

గుంటూరు 0.23 cr

కృష్ణా 0.25 cr

నెల్లూరు 0.13 cr

ఏపీ + తెలంగాణ (టోటల్) 3.08 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.09 cr

ఓవర్సీస్ 0.15 cr

వరల్డ్ వైడ్ (టోటల్) 3.32 cr

ALSO READ: విజ‌య్‌తో వంశీ పైప‌డిల్లి?