ENGLISH

బాల‌య్య కోసం చైనీస్ విల‌న్‌

12 September 2024-15:56 PM

నందమూరి నటసింహం బాలయ్య ఫుల్ స్వింగ్ లో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యే గోల్డెన్ జూబ్లీ వేడుకలు పూర్తి చేసుకున్న బాలయ్య, అదే జోరుతో వజ్రోత్సవ వేడుకలు కూడా చేసుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. సినిమా, రాజకీయాల్లో రెండిట్లో హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. దసరా బరిలో దిగాలని అనుకున్నా బాలయ్య బిజీ షెడ్యూల్ వలన ఈ మూవీ విడుదల వాయిదా పడింది. నెక్స్ట్ బోయపాటితో అఖండ 2 చేసే పని లో ఉన్నారు బాలయ్య. 


'అఖండ' మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు బోయపాటి. 'అఖండ 2 ' మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని, బాబీతో సినిమా పూర్తి చేసి బాలయ్య ఈ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. ఇప్పడు 'అఖండ 2 ' కోసం నటీ నటులు కావాలని టీమ్ ప్రకటన ఇచ్చింది. మొన్నటివరకు ఈ మూవీలో గోపి చంద్ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరిగింది కానీ ఇప్పడు చైనా విలన్ కావాలని టీమ్ కోరింది. 


మెయిన్ విలన్ పాత్ర కోసం కుదిరితే  చైనీస్ యాక్టర్ లేదా నార్త్-ఈస్ట్ నటులను తీసుకోవాలని బోయపాటి అనుకుంటున్నారట. హీరోతో పాటు విలన్ కి కూడా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉండటంతో మంచి నటుడ్ని ఎంపిక చేసే పనిలో వున్నారట. విలన్ ఏజ్ 50 నుంచి 55 ఏళ్ళు ఉండాలని 'ఆడిషన్ ఇండియా ఇన్ స్టా పేజి' ద్వారా యాడ్ ఇచ్చారు. విలన్ తో పాటు ఇంకో రోల్ కోసం16 నుంచి 18 ఏళ్ళ ఫీమేల్ యాక్టర్ కూడా కావాలని ప్రకటన ఇచ్చారు. ఏ భాషకి చెందిన అమ్మాయి అయినా యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలని పేర్కొన్నారు. అఖండ 2 లో మన దేవాలయాలు, ట్రెడిషన్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @auditionify_india