ENGLISH

చిరుతో హ‌రీష్ శంక‌ర్‌?

12 February 2024-11:23 AM

ఈమ‌ధ్య కొన్ని వెరైటీ కాంబినేష‌న్లు ఫిక్స‌వుతున్నాయి. కాంబినేష‌న్ విన‌గానే, ఆ సినిమాపై క్రేజ్ మొద‌లైపోతోంది. అలాంటి ఓ కాంబినేష‌న్ ఇప్పుడు మ‌రోటి సెట్ అయిన‌ట్టు టీటౌన్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే.. చిరంజీవితో హ‌రీష్ శంక‌ర్‌.


మెగా ఫ్యామిలీ అంటే హ‌రీష్ శంక‌ర్‌కు చాలా ఇష్టం. ఇప్ప‌టికే ప‌వ‌న్‌, సాయిధ‌ర‌మ్, వ‌రుణ్ తేజ్ ల‌తో సినిమాలు చేసేశాడు. ఇక మిగిలింది మెగాస్టారే. ఆ స్వ‌ప్నం కూడా అతి త్వ‌ర‌లో నెర‌వేరే ఛాన్సుంది. చిరు కోసం హ‌రీష్ ఓ ఎంట‌ర్‌టైన‌ర్‌ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరు `విశ్వంభ‌ర‌` చేస్తున్నాడు. దాంతో పాటు స‌మాంత‌రంగా మ‌రో సినిమా చేయాల‌న్న‌ది చిరు ప్లాన్‌.


అనిల్ రావిపూడితో చిరు ఓ సినిమా చేయాల్సింది. అది వెంక‌టేష్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ స్థానంలో హ‌రీష్ తో సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుందని స‌మాచారం అందుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. అన్నీ కుదిరితే.. త‌ప్ప‌కుండా ఇదో క్రేజీ కాంబో అవుతుంది. హ‌రీష్ ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్ తో 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌' కొంత మేర షూటింగ్ జ‌రుపుకొని, ప‌వ‌న్ కాల్షీట్ల కోసం ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే.