ఆగస్టు 22.. ఈ తేదీ ప్రత్యేకత ఏమిటో మెగా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజు... చిరు పుట్టిన రోజు. ప్రతీ పుట్టిన రోజుకీ.. చిరు నుంచి ఏదో ఓ అప్ డేట్ కచ్చితంగా ఉంటుంది. అయితే ఈసారి.. ఆయన నుంచి ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా నాలుగు అప్ డేట్లు రాబోతున్నాయి.
కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సరికొత్త టీజర్ చిరు పుట్టిన రోజు కానుకగా వచ్చే అవకాశాలున్నాయి. అంతే కాదు.. ఇటీవలే `లూసీఫర్` రీమేక్ పట్టాలెక్కింది. దీనికి... మోహన్ రాజా దర్శకుడు. `గాడ్ ఫాదర్` పేరు దాదాపుగా ఖాయమైంది. ఈ టైటిల్ ని చిరు పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించే అకాశాలున్నాయి. మరోవైపు `వేదాళం` రీమేక్ కి సంబంధించిన అప్ డేట్ కూడా అదే రోజు రావొచ్చు. బాబి - మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి ఓ కీలకమైన అప్ డేట్ చిరు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేద్దామనుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఆగస్టు 22... చిరు అభిమానులకు గిఫ్టులమీద గిఫ్టులు అందబోతున్నాయన్నమాట. అంతకంటే కావల్సిందేముంది?
ALSO READ: నాగ చైతన్య 'లవ్ స్టొరీ' విడుదల తేది!