ENGLISH

'లెజెండరీ అవార్డు' ఘటన పై చిరు చురకలు

29 October 2024-16:15 PM

మెగాస్టార్ చిరంజీవికి గుడ్ టైం నడుస్తోంది. ఈ ఏడాది పద్మవిభూషణ్ అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇప్పుడు అక్కినేని జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. టోటల్ గా మెగా ఇంట అవార్డుల పంట పండుతోంది. అక్కినేని శతజయంతి ఉత్సవాలు సందర్భంగా సోమవారం ANR నేషనల్ అవార్డ్స్ వేడుక జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ANR నేషనల్ అవార్డు అందుకున్నారు చిరు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడూతూ 'పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులతో సత్కరించినా ఏఎన్ఆర్ అవార్డు తనకు ఎంతో విలువైందని చిరంజీవి పేర్కొన్నారు.

అవార్డు తీసుకున్న తరవాత చిరంజీవి మాట్లాడుతూ 'ఇంట‌ గెలిచి రచ్చ గెలవటం'  అంటే ఇదే నని పద్మ పురస్కరాలు నేషనల్ వైడ్ అయితే  ఏఎన్ఆర్ అవార్డు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించింది అని పేర్కొన్నారు. పద్మ పుర‌స్కారాల కంటే కూడా ఏఎన్నార్ పుర‌స్కారం త‌న‌కు ఎక్కువ ఆనందాన్నిచ్చింద‌ని చిరు మాటల్లో తెలుస్తోంది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని కూడా జ్ఞప్తికి తెస్తూ సెటైర్ వేయటం గమనార్హం. వ‌జ్రోత్స‌వ వేడుకల్లో జరిగిన 'లెజెండరీ అవార్డు' వివాదాన్ని కూడా చిరు ప్రస్తావించారు.

టాలీవుడ్ లో జరిగిన వ‌జ్రోత్స‌వాల‌ వేడుకల్లో చిరుకి 'లెజెండరీ అవార్డు' ప్రకటించారు. దీనిపై కొందరు కామెంట్స్ చేయటంతో చిరు ఆ అవార్డ్ ని తిరస్కరించారు. టైమ్ క్యాప్సూల్‌లో ఉంచుతానని అర్హత ఉన్నప్పుడే ఆ అవార్డు ని స్వీకరిస్తానని హోల్డ్ లో పెట్టారు చిరు. ఇప్పుడు  అమితాబ్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డును అందుకోవడం, స్నేహితుడు నాగార్జున అవార్డు అందుకోవడానికి చిరుని ఆహ్వానించడం ఇవన్నీ ఇంట్లోను గెలిచినట్లే అని ఛ‌మ‌త్క‌రించారు. ఇన్నాళ్లు బ‌య‌టి వ్య‌క్తుల ప్ర‌శంసలు అందుకుంటే ఇప్పుడు త‌న ఇంటి (టాలీవుడ్) వ్య‌క్తులే తనని గౌర‌వించారని గర్వపడ్డారు.