ENGLISH

అమ్మ‌కోసం.. చిరు చేప‌ల ఫ్రై

10 August 2020-11:41 AM

సండే అన‌గానే... నాన్ వెజ్ ప్రియుల‌కు చేప‌లు గుర్తొస్తాయి. చేప‌ల‌తో చాలా ర‌కాల వెరైటీలు చేసుకోవొచ్చు. అందులో.. చేప‌ల ఫ్రై ఒక‌టి. అయితే.. చింత‌కాయ వేసి చేప‌ల  ఫ్రై చేయ‌డం ఎప్పుడైనా చూశారా..?  కానీ ఆ వంట‌కాన్ని చిరు ఇప్పుడు ప‌రిచ‌యం చేశారు.

చిన్న‌ప్పుడు అంజ‌నాదేవి.. చింత‌కాయ గుజ్జుతో, చిన్న చేప‌ల ఫ్రై చేసి వండిపెట్టేవార్ట‌. అది గుర్తొచ్చి.. `అమ్మ కోసం నేను చేప‌ల ఫ్రై ఎందుకు చేయకూడదు` అనిపించి, ఆ వంట‌కం ట్రై చేశారు చిరంజీవి. చింత‌కాయ‌, చిన్న చేప‌ల ఫ్రై ఎలా చేస్తారో.. ఆ విధానాన్ని స్వ‌యంగా చేసి చూపించారు. చిరు వంట చేస్తున్న విధానం చూస్తుంటే.. వంట చేయ‌డంలో మంచి అనుభ‌వం ఉన్న‌వాడిలానే క‌నిపించారు. చాలా ప‌ద్ధ‌తిగా... చేప‌ల ఫ్రై చేస్తూ, మ‌ధ్య‌మ‌ధ్య‌లో త‌న‌దైన కామిక్ సెన్స్ జోడిస్తూ.. చేప‌ల ఫ్రై పూర్తి చేశారు. అమ్మ‌కు స్వ‌యంగా వడ్డించి, ఆమె చేత కూడా బాగుంది అనిపించుకున్నారు. ఈ వీడియో త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు చిరంజీవి. అమ్మ వంట ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మ‌కి వండి పెట్టి.. ఇష్టంగా తినిపించే చిరు.. నిజంగా ఓ ఆద‌ర్శ పుత్రుడు. ఇప్పుడు ఈ వంట‌.. మీరు కూడా ట్రై చేస్తారేంటి?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

ALSO READ: తమిళ రంగస్థలంలో ఆ హీరో ఫిక్స్ అయినట్టేనా?