ENGLISH

లూసీఫ‌ర్‌.. ఉంటుందా.. ఆగుతుందా?!

26 June 2021-13:28 PM

ఏ ముహూర్తాన లూసీఫ‌ర్‌ రీమేక్ చేయాల‌ని చిరంజీవి అనుకున్నాడో గానీ, ఆ సినిమాకి ఏదో ఓ ఆటంకం ఏర్ప‌డుతూనే ఉంది. ముందు సుజిత్ ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నారు. ఆ త‌ర‌వాత‌.. వినాయ‌క్ చేతికి వెళ్లింది. ఆయ‌న కూడా చేతులెత్తేశాక‌... మోహ‌న్ రాజా ఎంట్రీ ఇచ్చాడు. గ‌త ఆరు నెల‌లుగా మోహ‌న్ రాజా ఈ స్క్రిప్టుపై వ‌ర్క్ చేస్తూనే ఉన్నారు. స్క్రిప్టు పూర్తి చేసి, చిరంజీవికి వినిపించ‌డం, ఆయ‌న కొన్ని క‌ర‌క్ష‌న్లు చెప్ప‌డం, మ‌ళ్లీ చేసుకురావ‌డం, మ‌ళ్లీ క‌ర‌క్ష‌న్లు చెప్ప‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే తంతు,

 

ఎన్నిసార్లు స్క్రిప్టు తిర‌గ‌రాసినా... చిరుకి ఏదో మూల అసంతృప్తి క‌లుగుతూనే ఉంద‌ని స‌మాచారం. దాంతో ... ఇప్పుడు మోహ‌న్ రాజా కూడా ఈ సినిమా వ‌దిలేసి ప‌క్క‌కు వెళ్లిపోతార‌ని, లూసీఫ‌ర్‌మ‌రో ద‌ర్శ‌కుడి చేతిలోకి వెళ్తుంద‌ని ప్రచారం జ‌రుగుతుంది. కొందరైతే... ఏకంగా `లూసీఫ‌ర్` ప్రాజెక్టే ఉండ‌ద‌ని చెప్పేస్తున్నారు. `ఆచార్య‌` విడుద‌లైన త‌ర‌వాత‌... ఈసినిమానే ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది ప్లాన్‌. అయితే అది ఇప్పుడు జ‌రిగేలా లేదు. మ‌రి చిరు ఎటువైపు అడ‌గులేస్తారో చూడాలి.

ALSO READ: ఐకాన్ కి మ‌రో స్పీడ్ బ్రేక‌ర్‌!