ENGLISH

2021 సంక్రాంతికి మొద‌లు.. 2022 సంక్రాంతికి విడుద‌ల‌

23 November 2020-15:21 PM

ప్ర‌స్తుతం `ఆచార్య‌` తో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఆ త‌ర‌వాత ఎలాంటి సినిమాలు చేయాలి? వాటిని ఎప్పుడు విడుదల చేయాలి? అనే విష‌యాల్లో ఆయ‌న చాలా స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. లూసీఫ‌ర్‌, వేదాళం రీమేక్‌ల‌పై చిరు దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. వేదాళం రీమేక్ ని మెహ‌ర్ ర‌మేష్‌కి అప్ప‌గించారు. లూసీఫ‌ర్ బాధ్య‌త‌లు త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా చూసుకునే అవ‌కాశాలున్నాయి.

 

లూసీఫ‌ర్ రీమేక్ ని 2021 సంక్రాంతికి మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు చిరంజీవి. 2022 సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. 2021 వేసవిలో `ఆచార్య‌` వ‌స్తుంది. అంటే.. ఆచార్య వ‌చ్చిన ఆరేడు నెల‌ల‌కు `లూసీఫ‌ర్‌` కూడా వ‌చ్చేస్తుంది. 2022లోనే `వేదాళం` రీమేక్‌నీ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అంటే 2022లో చిరు నుంచి రెండు సినిమాలొస్తాయ‌న్న‌మాట‌. ఈ నెలాఖ‌రుకి `లూసీఫ‌ర్‌` ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: వెంకీ ఓకే... త‌రుణ్ హ్యాపీ!