ENGLISH

ముస్లిం సోదరులకు శుభాకాంక్ష‌లు!

01 August 2020-09:30 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బక్రీద్. కానీ ఈ ఏడాది మాత్రం బక్రీద్ ఏ ఆర్బాటం లేకుండా ఎక్కడివాళ్ళు అక్కడే.. మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే జరుపుకోవాల్సిన పరిస్థితి. తమకు మనోధైర్యాన్నిస్తూ తమకు సంతోషాన్నీ, శాంతిని చేకూరాలని మన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు తమ శుభాకాంక్ష‌లు తెలియజేసారు.

 

ఈద్ ముబార‌క్‌, ఆనంద‌క‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. 2020లో మీరు ప్రేమ‌, సంతోషాల‌ను వ్యాప్తి చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ‘‘స‌ర్వ‌మాన‌వ సౌబ్రాతృత్వం నెల‌కొనాలి. దీన్ని మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవాలి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌ను దాటుకోవాలి. అంద‌రికీ ఇదొక శుభారంభం కావాలి’’ అంటూ మ‌హేశ్ బాబు ట్వీట్ చేసాడు.

ALSO READ: బాల‌య్య కోసం 'ఎఫ్ 3' ప‌క్క‌న పెట్టేస్తాడా?