ENGLISH

చిరుకి క‌రోనా.. మరి వాళ్ల ప‌రిస్థితేంటి?

10 November 2020-09:30 AM

మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక గా ధృవీక‌రించారు కూడా. గ‌త నాలుగైదు రోజులుగా త‌న‌తో ట‌చ్‌లో ఉన్న‌వాళ్లంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. దాంతో.. ఇప్పుడు చిరుని కలిసిన వాళ్లంద‌రికీ కాస్త బెంగ ప‌ట్టుకుంది. ముఖ్యంగా ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని చిరు, నాగ్ క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే.

 

ఆ స‌మ‌యంలో అటు నాగార్జున‌కు గానీ, ఇటు కేసీఆర్ కి గానీ మాస్కులు లేవు. దాంతో.. కేసీఆర్‌, నాగ్ ఇద్దరూ క‌రోనా టెస్టులు చేయించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేసీఆర్‌కి డైలీ రొటీన్ లో భాగంగా ప‌లుమార్లు కొవిడ్ టెస్ట్ చేయిస్తుంటారు. ఈసారి మాత్రం త‌ప్ప‌క చేయించాలి. నాగ్ అయితే ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న‌ట్టు టాక్‌. రిపోర్టు రావాల్సివుంది.

 

మ‌రోవైపు కొర‌టాల శివ‌, మెహ‌ర్ ర‌మేష్‌లు కూడా ఇటీవ‌ల చిరుని కలిశారు. వారిద్ద‌రూ కోవిడ్ టెస్టులు చేయించుకున్నార్ట‌. చ‌ర‌ణ్ తో పాటు మెగా కుటుంబ స‌భ్యులు మొత్తం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని స‌మాచారం. వాళ్ల రిపోర్టులు రావాల్సివుంది.

ALSO READ: ర‌జ‌నీ బ‌యోపిక్‌... హీరో ఎవ‌రంటే..?