ENGLISH

టామ్ అండ్ జెర్రీ.. సిక్కిం టూర్‌!

15 March 2021-14:48 PM

చిరంజీవి - మోహ‌న్ బాబు... ఇద్ద‌రూ ఇద్ద‌రే. మంచి మిత్రులు. ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకునేంత చ‌నువు ఉంది. `మేమిద్ద‌రం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం` అంటూ.. స్వ‌యంగా చిరంజీవినే ఓ సంద‌ర్భంలో చెప్పారు. చిరు పుట్టిన రోజున‌.. మోహ‌న్ బాబు బ‌హుమ‌తులు పంప‌డం, చిరు మోహ‌న్ బాబుకి గిఫ్టులు ఇవ్వ‌డం అభిమానులూ చూశారు. ఇప్పుడు ఈ టామ్ అండ్ జెర్రీ క‌లిసి స‌ర‌దాగా ఓ టూర్ కూడా వేశారు.

 

ఇద్ద‌రూ క‌లిసి సిక్కిం వెళ్లిపోయారు. అక్క‌డ ఈ వీకెండ్ గ‌డిపేశారు. ఈ విష‌యాన్ని మంచు ల‌క్ష్మి త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు చేర‌వేసింది. ఇద్ద‌ర్నీ చూస్తే.. అసూయ‌గా కూడా ఉంద‌ని కామెంట్ చేసింది. ఈసారి.. టూర్ కి త‌న‌ని కూడా తీసుకెళ్ల‌మ‌ని అప్లికేష‌న్‌పెట్టుకుంది. చిరు, మోహ‌న్ బాబు... ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆ బిజీకి కాస్త పుల్ స్టాప్ పెట్టి.. ఇలా స‌ర‌దాగా ట్రిప్పేసి వ‌చ్చేశార‌న్న‌మాట‌.

ALSO READ: శ్రీ‌కారం 4 రోజుల వ‌సూళ్లు.. ఇలాగైతే క‌ష్ట‌మే