ENGLISH

చిరు- ర‌వితేజ‌.. కాంబో ఫిక్స‌యిపోయిన‌ట్టే!

13 November 2021-17:43 PM

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కి రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. చిరంజీవి క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి వాల్తేరు వీర‌న్న‌, వాల్తేరు వాసు, వాల్తేరు శ్రీ‌ను.. ఇలాంటిపేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడికీ చోటుంది. అంటే.. మ‌ల్టీస్టార‌ర్ అన్న‌మాట‌. ర‌వితేజ ఈపాత్ర‌లో క‌నిపించే ఛాన్సుంద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.ఇప్పుడు అదే ఖాయ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది.

 

చిరంజీవి వీరాభిమానుల్లో ర‌వితేజ ఒక‌డు. `అన్న‌య్య‌`లో చిరు త‌మ్ముడిగా ర‌వితేజ న‌టించాడు. అయితే హీరోగా మారాక మాత్రం ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌లేదు. అది ఈసినిమాతో తీర‌బోతోంది. ఓ హీరోకీ, అత‌ని అభిమానికీ మ‌ధ్య న‌డిచే క‌థ ఇద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌రి ఈ క‌థ‌లో హీరో ఎవ‌రో, అభిమాని ఎవ‌రో తెలియాల్సివుంది. త్వ‌ర‌లోనే ర‌వితేజ పేరుని అధికారికంగా ఖాయం చేసే అవ‌కాశాలున్నాయి. దాంతో పాటుగా ఈ సినిమా టైటిల్ నీ, హీరోయిన్ల వివ‌రాల్నీ చిత్ర‌బృందం అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌బోతోంది. అప్ప‌టి వ‌ర‌కూ.. ఎదురు చూడాల్సిందే.

ALSO READ: ప్ర‌మోష‌న్ల‌పై గురి పెట్టిన రాధే శ్యామ్