ENGLISH

చిరు, స‌ల్మాన్ స్టెప్పేస్తే..?

15 November 2021-12:00 PM

చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ అయితే.. స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ క్రేజీ స్టార్‌. ఇద్ద‌ర్ని ఒకే సినిమాలో చూడ‌డ‌మే క‌నుల విందు. అలాంటిది.. ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పేస్తే..? ఎలా ఉంటుంది? అదిరిపోతుంది క‌దా? వీరిద్ద‌రూ క‌లిసి డాన్స్ చేస్తుండ‌గా చూసే అవ‌కాశం `గాడ్ ఫాద‌ర్‌` క‌ల్పిస్తోంది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీక‌ల‌మైన పాత్ర కోసం స‌ల్మాన్ ఖాన్ ని ఎంపిక చేశారు. సినిమా క్లైమాక్స్ లో వ‌చ్చే పాత్ర ఇది.

 

 

క‌థ‌కు చాలా కీల‌కం. అయితే స‌ల్మాన్ ని కేవ‌లం ఆ సీన్ కోస‌మే ప‌రిమితం చేయ‌కుండా.. త‌న ప‌రిధి పెంచి, ఓ పాట కూడా కేటాయించాల‌ని, ఆ పాట‌లో చిరు, స‌ల్మాన్ ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పులు వేస్తార‌ని తెలుస్తోంది. `లూసీఫ‌ర్‌`లో ఈ పాత్ర‌ని ఫృథ్వీరాజ్ చేశారు. అక్క‌డ మోహ‌న్ లాల్, ఫృథ్వీ క‌లిసి స్టెప్పులేం వేయ‌రు. కానీ తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ ని బ‌ట్టి, ఆ పాత్ర ప‌రిధి మార్చారు.

 

`సైరా` సినిమాతో బాలీవుడ్ లోనూ త‌న త‌ఢాకా చూపించాల‌నుకున్నాడు చిరు.కానీ అది సాధ్యం కాలేదు. స‌ల్మాన్ రాక‌తో.. గాడ్ ఫాద‌ర్‌ ఇప్పుడు బాలీవుడ్ త‌లుపు త‌డుతుంది. ఈసారైనా చిరు ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో, లేదో చూడాలి.

ALSO READ: ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చేశాడు