ENGLISH

మెగాస్టార్‌ ఓన్లీ సినిమా!

14 March 2017-18:04 PM

మెగాస్టార్‌ చిరంజీవి ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఆయన సినిమాలకు మాత్రమే పరిమితమవుతారట. తెలుగు సినీ వర్గాల్లో కొంత కాలం నుండి దీనికి సంబంధించి అనేక గాసిప్స్‌ వినవస్తున్నాయి. చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా చేయబోతున్నారు ప్రస్తుతం. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. దీని నిర్మాణానికి చాలా సమయం పట్టవచ్చు. ఇంకో వైపున ఓ కమర్షియల్‌ సినిమా కూడా చేసే ఆలోచన ఉన్నారు. చిరంజీవితో సినిమాలు చేసే దర్శకుల లిస్ట్‌ క్లియర్‌గా ఉంది. సురేందర్‌రెడ్డి, ఆ తర్వాత బోయపాటి శ్రీను ఇలా దర్శకుల లైనప్‌ కనిపిస్తుండడం చూస్తే, పూర్తిగా చిరంజీవి సినిమాల్లోనే రానున్న మూడు నాలుగేళ్ళు బిజీగా ఉండొచ్చు. సినీ నటుడు, జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌ తన పార్టీలోకి చిరంజీవి వచ్చే అవకాశం లేదని చెప్పడం కూడా చిరంజీవి రాజకీయాల వైపు వెళ్ళరనే సంకేతాల్ని బల పరుస్త్నుట్లుగానే భావించాలి. రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా తొమ్మిదేళ్ళ సినీ కెరీర్‌ని చిరంజీవి కాదనుకున్నారు. తనకు కంఫర్ట్‌ జోన్‌ అయిన సినిమాల్నే మళ్ళీ తనకు కేరాఫ్‌ అడ్రస్‌గా చిరంజీవి మార్చేసుకున్నారని భావించాలి. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఇచ్చిన కిక్‌తో చిరంజీవి, సినీ రంగంలో ఓ రకమైన కిక్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ కిక్‌ ఆయనకి రాజకీయాల్లో దొరకలేదేమో. 

ALSO READ: పూరి విడుదల చేసిన